1. నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులను దేవుళ్ళుగా భావించాను,వాళ్ళను పూజించను.
2. నేను రాముడు, కృష్ణుణ్ణి దేవుళ్ళు అనను వారిని పూజించను.
3. నేను గౌరీ,గణేశులను మరి ఏ ఇతర హిందూ దేవుళ్ళను పూజించను.
4. నాకు దేవుని అవతారం మీద నమ్మకం లేదు.
5. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అనడం తప్పు, ద్వేషపూరితం.
6. నేను శ్రార్థ కర్మలు గానీ పిండ ప్రదానం గానీ చేయను.
7. నేను బుద్ధుని బోధనలకు విరుద్ధంగా ఉంటే ఏ ఒక్కసారి పాటించను.
8. నేను బ్రాహ్మణుల ఆచారాలను పాటించను.
9. నేను మానవులంతా సమానమని నమ్ముతాను.
10. నేను సమానత్వ స్థాపనకు కృషి చేస్తాను.
11. నేను అష్టాంగ మార్గాన్ని ఆచరిస్తాను.
12. నేను బుద్ధుడు చెప్పిన దశ పారామితులను ఆచరిస్తాను.
13. నేను సమస్త జీవుల పట్ల దయ కలిగి ఉంటాను.
14. నేను దొంగతనం చేయను.
15. నేను అబద్ధాలు చెప్పను.
16. నేను ఎటువంటి రోగుల దుర్మార్గాలకు ఉన్నాను.
17. నేను మద్యం సేవించను.
18. నేను జ్ఞానం,నీతి,దయలపై ఆధారపడిన సూత్రాలతో జీవిస్తాను.
19. మనుషులను సమానంగా చూడని, నా ఎదుగుదలకు హానికరమైన హిందూ మతాన్ని బహిష్కరించి,బుద్ధుని ధర్మాన్ని అనుసరించాను.
20. నేను బుద్ధుని ధర్మం మాత్రమే సరైనదని ఒప్పుకుంటున్నాను.
21. నేను కొత్తగా జన్మిస్తున్నానని నమ్ముతున్నాను.
22. నేను ఇప్పటినుండి బుద్ధుని బోధనలకు అనుగుణంగా నడుచుకుంటాను.
సి మనోహర్ అనువదించారు.
ఎడిటర్ యొక్క గమనిక – ఇది ఆంగ్లం నుండి 22 ప్రమాణాల యొక్క పని డ్రాఫ్ట్ అనువాదం. మీరు అనువాదంలో ఏదైనా పొరపాటును కనుగొంటే లేదా మంచి అవగాహన కోసం మరొక పదాన్ని సూచించాలనుకుంటే దయచేసి మాకు తెలియజేయండి. ధన్యవాదాలు.